కొబ్బరి రైతులకు కేంద్రం చేయూత : రాణి రుద్రమ

కొబ్బరి రైతులకు కేంద్రం సబ్సిడీపై మొక్కలు అందిస్తోంది. ఎకరానికి రూ.28 వేల నుంచి 2.5 ఎకరాలకు రూ.56 వేల వరకు సాయం పొందే అవకాశముందని రాణి రుద్రమ తెలిపారు.

కొబ్బరి తోటలు పెంచే రైతులకు కేంద్రం చేయూత అందిస్తుందని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె పోస్టు చేశారు. ఏపీ ఏలూరు వేకివాడ కొబ్బరి డెవలప్మెంట్ బోర్డు, కొబ్బరి పరిశోధన కేంద్రం నుంచి రైతులు సబ్సిడీపై కొబ్బరి మొక్కలు అందిస్తున్న విషయాన్ని ఆమె ఆ వీడియోలో వివరించారు.

ఎకరానికి 60మొక్కలు చొప్పున ఒక్కో మొక్కకు రూ.350, ఎకరానికి రూ.28,000, 2.5 ఎకరాలకు రూ.56, 000 సబ్సిడీగా కేంద్రం అందిస్తుందని ఆమె వెల్లడించారు. 5ఎకరాల వరకు సబ్సిడీ పథకానికి అందిస్తారు. ఆసక్తిగల రైతులు ఈ కేంద్రాన్ని సంప్రదించి సబ్సిడీపై కొబ్బరి మొక్కలు పొందాలని రాణి రుద్రమ తెలిపారు. ప్రతి జిల్లాలోని కృషి విజ్ఞాన్ కేంద్రం హార్టీకల్చర్ అధికారుల ద్వారా రైతులు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వంద శాతం సబ్సిడీపై కొబ్బరి మొక్కలు అందించే ఈ పథకాన్ని రైతులు ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ పంటలు, తోటల దిశగా కొబ్బరి తోటలు పెంచుకోవచ్చని తెలిపారు.

Latest News