రాయలసీమ రాష్ట్రమే శరణ్యం
విధాత: నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, రాయలసీమ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు సీమకృష్ణ మాట్లాడుతూ తాము ముందునుంచి శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని 2014నుండి ఉద్యమం చేస్తున్నామన్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన […]

విధాత: నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, రాయలసీమ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు సీమకృష్ణ మాట్లాడుతూ తాము ముందునుంచి శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని 2014నుండి ఉద్యమం చేస్తున్నామన్నారు.
అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటెద్దుపోకడతో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయ సంకల్పించారని అయితే ఈ నిర్ణయాన్ని రాయలసీమ విద్యార్థి,యువజన,ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసామని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తానని రాయలసీమ ప్రజలను రెండు సంవత్సరాలుగా మభ్యపెడుతూ నేడు వికేంద్రీకరణ బిల్లైన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నారు.
ఇలా నాయకులు వాల్లకు ఇష్టంవచ్చినట్లు నిర్ణయాలను తీసుకుంటూ రాయలసీమ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తూవస్తున్నారని అయితే ఈ కల్లబొల్లిమాటలు నమ్మే పరిస్థితిలో రాయలసీమ ప్రజలు లేరనీ కేవలం ప్రకటనలకే పరిమితమైన అభివృద్ధి వికేంద్రీకరణలు రాయలసీమ ప్రజలకు అవసరంలేదని శ్రీబాగ్ ఒప్పందం అమలు చేసీ పూర్తిస్థాయి రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్, నాయకులు సురేంద్ర రెడ్డి, తెర్నేకల్ రవికుమార్ ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని రాయలసీమ హక్కు 1953నుండి 1956వరకు రాయలసీమ కర్నూలులో కొనసాగిన రాజధాని హైదరాబాదుకు తరలించి రాయలసీమ ప్రజలను మోసం చేసారనీ ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే తిరిగి కర్నూలులో ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.