‘రాంకీ’ అవినీతిపై ‘ఆర్కే’ రాజీనామా చేయాలి
విధాత:రాంకీ గ్రూపులో జరిగిన అవినీతికి కారణమైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. రాంకీలో అవినీతికి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, ఆయన సోదరుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కారకులని, అన్న కంపెనీలో తమ్ముడు ఆర్కే కు 12000 షేర్లు ఉన్నాయని, జె స్కూల్ నుంచి వచ్చిన ఆళ్ల,అయోధ్య ఆర్ధిక ఉగ్రవాదులని టిడిపి నేతలు విమర్శించారు. అవినీతికి కారకులైన అన్నాదమ్ములు తమ పదవులకు రాజీనామా చేయాలని, వీరిద్దరిపై విచారణ జరపాలని […]

విధాత:రాంకీ గ్రూపులో జరిగిన అవినీతికి కారణమైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. రాంకీలో అవినీతికి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, ఆయన సోదరుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కారకులని, అన్న కంపెనీలో తమ్ముడు ఆర్కే కు 12000 షేర్లు ఉన్నాయని, జె స్కూల్ నుంచి వచ్చిన ఆళ్ల,అయోధ్య ఆర్ధిక ఉగ్రవాదులని టిడిపి నేతలు విమర్శించారు. అవినీతికి కారకులైన అన్నాదమ్ములు తమ పదవులకు రాజీనామా చేయాలని, వీరిద్దరిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ కంపెనీల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారని, దీనితో వందలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని,అన్న కంపెనీల్లో 12000 షేర్లు భాగస్వామి అయిన తమ్ముడు రామకృష్ణారెడ్డి అవినీతికి బాధ్యతగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. రాంకీ గ్రూప్ లో జరిగిన అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని, సింగపూర్ కంపెనీలకు రాంకీ షేర్లను అమ్మి ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి వందలకోట్ల ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. రాంకీ గ్రూపుకు వందలకోట్లు నష్టం వచ్చినట్లు దొంగలెక్కలు చూపారని, ఐటీ రైడ్ తో వీరి భాగవతం బయటపడిందని, తమ అవినీతిపై ఆర్కే ఎందుకు నోరు మెదపడం లేదని వారు ప్రశ్నించారు. లేస్తే అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఆరోపణలు గుప్పించే ఆర్కే తన అవినీతిపై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పూలరవి అనే దళిత రైతు కరకట్ట కమలహాసన్ గుడ్డలిప్పి నడిరోడ్డున పెట్టడని, అయినా ఆర్కేసిగ్గులేదని, తన స్వంత కంపెనీలో అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదని వారు ప్రశ్నించారు. జగన్ రెడ్డి తన స్కూల్లో ఆర్ధిక ఉగ్రవాదులను తయారుచేస్తున్నారని, జె స్కూల్ విధ్యార్థులుగా ఉన్న అయోధ్యరామిరెడ్డి, ఆళ్ల ఐటీ దోపిడీ చేస్తున్నారు. నేరం చేశానని ఒప్పుకున్న అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసి కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు