కడప,విధాత: చెన్నూరు పెన్నా బ్రిడ్జి పై ద్విచక్ర వాహనాన్ని బొలెరో టెంపుల్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులు చాపాడు మండలం నక్కల దిన్నె అనంతపురం గ్రామానికి చెందిన చెవ్వూరు మల్లేష్(45) వెంకట లక్షమ్మ(47) లావణ్య(10) గా గుర్తింపు.చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద గల తన సోదరుడికి రాఖీ కట్టడానికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వెనుక వైపు నుంచి బొలోరో టెంపో వాహనం డీ కొన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.ఘటణ జరిగిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 లో కడప రిమ్స్ కు తరలించిన పోలీసులు.