రాయల్ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

సీఎం చంద్రబాబు మరో ఆసక్తికర ట్వీట్ తో సోషల్ మీడియాలో సందడి చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ రాయలసీమలోకి దూసుకుపోతోంది! అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తన పోస్టులో చంద్రబాబు..రాయల సీమ ఇప్పుడు రాయల్ సీమ అంటూ క్యాప్షన్ తో కూడిన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఫోటోను సైతం షేర్ చేశారు.

రాయల్ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

అమరావతి : నిన్న మంత్రి నారా లోకేశ్ ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా? అంటూ చేసిన ట్వీట్ తో నెటిజన్లలో రచ్చ రేపిన అంశం మరువకముందే…నేడు సీఎం చంద్రబాబు మరో ఆసక్తికర ట్వీట్ తో  సోషల్ మీడియాలో సందడి చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ రాయలసీమలోకి దూసుకుపోతోంది! అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తన పోస్టులో చంద్రబాబు..రాయల సీమ ఇప్పుడు రాయల్ సీమ అంటూ క్యాప్షన్ తో కూడిన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఫోటోను సైతం షేర్ చేశారు.

అంతకుముందు మంత్రి లోకేశ్ ‘Guess who’s coming to AP?’ అంటూ తను రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ను నడుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేయడం..అది వైరల్ కావడం తెలిసిందే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏపీకి రాబోతోందంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంది.

తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ బుల్లెట్‌ మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) బుధవారం అమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసింది.