“తాకట్టు” లో ఆంధ్రులు

బిక్షాంధ్ర‌ప్రదేశ్ గా మారటానికి సంకేతం. మన మౌనం తో బిడ్డల భవిష్యత్ దోపిడి. ఆంధ్రాలో హీరోలు తెలంగాణా లో జీరోలు. ఏపి లో తీవ్రమైన ఆర్ధిక, రాజకీయ సంక్షోభం. ఏపిలో రాష్ట్రపతి పాలన తప్పదా ! ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరం. విధాత‌:ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపి సర్కార్ దివాళా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా, చేసారు. ఆంధ్రప్రదేశ్ […]

  • Publish Date - August 2, 2021 / 04:08 AM IST
  • బిక్షాంధ్ర‌ప్రదేశ్ గా మారటానికి సంకేతం.
  • మన మౌనం తో బిడ్డల భవిష్యత్ దోపిడి.
  • ఆంధ్రాలో హీరోలు తెలంగాణా లో జీరోలు.
  • ఏపి లో తీవ్రమైన ఆర్ధిక, రాజకీయ సంక్షోభం.
  • ఏపిలో రాష్ట్రపతి పాలన తప్పదా !
  • ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరం.

విధాత‌:ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపి సర్కార్ దివాళా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా, చేసారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా అలసత్వం, దుబారా కారణం గా ఏపిలో ఆర్ధిక సంక్షోభం మెండుగా వుందని, ఉద్యోగుల జీవితాలు దిక్కుతోచని స్థితిలో వున్నాయని, కొంతమంది ఉద్యోగ నేతల స్వప్రయోజనాలకు ఉద్యోగుల శ్రమను, వారి కుటుంబాల ఆక్రన్దనను ఉద్యోగ నేతల సొంత ప్రయోజనాలుకు దారిమళ్లించుకుంటున్నారని, ఉద్యోగుల వెతలుపై ప్రభుత్వం దృష్టి సారించకుండా పాలకులకు మేలుచేస్తు సహచర ఉద్యోగులకు ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు ప్రతి నెలా 1 వ తేదిన జీతం వస్తుందనే ఆశ లేకుండా పోతుందని, ఈ కారణంగా ఉద్యోగుల కుటుంబాలు పాల వాళ్ల‌తోను, కూరగాయలు వారితోను మనస్పర్థలు తలెత్తుతున్నాయని, ఇంటి అవసరాలకు తీసుకున్న కన్జ్యూమర్ పరికరాలకు సంబందించిన ఋణాలు చెల్లించలేక U/s 138 Ipc NI Act కేసులు ఎదుర్కోవలసి వస్తుందని, ఉద్యోగ కుటుంబాలు విద్యుత్ బిల్లులు, టెలిఫోన్, నెట్ బిల్లులు సకాలంలో చెల్లించలేక పోతున్నారని, ఈ విపత్కర పరిస్థితులుకు ఏపి సర్కార్ కారణం అని ఆయన పేర్కొన్నారు.

ఏపి ఆర్థిక పరిస్థితి అద్వానంగా వుందని,అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ గా ఆర్తనాదాలు పెడుతుందని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా ప్రమాద కర స్థితిలో వుందని, ప్రస్తుత పాలకులు ఆంధ్రప్రదేశ్ ను బిక్షాన్ద్ర ప్రదేశ్ గా మారే ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని, ఓటర్లను యాచకులుగా మార్చేసారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో వుందని, ప్రతి ఆంధ్రుడి భవిష్యత్ ను ప్రభుత్వ అవసరాలకు, రాజకీయ అవసరాలకు సర్కార్ తాకట్టు పెట్టేస్తుందని , పాలకులు కుట్ర తో ఆంధ్రుల ప్రమేయం లేకుండానే ప్రతి ఆంధ్రుడు తాకట్టు లో ఇరుక్కున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.

ప్రస్తుత కార్పొరేట్ రాజకీయ పార్టీలు ఓటర్లను బలహీనులుగా మార్చేసారని, మత్తు ప్రదార్దాలతో సమానంగా ఓటర్ల శక్తిని నిర్వీర్యం చేసేసారని,బిడ్డల జీవితాలు బుగ్గిపాలు అయ్యిపోతున్నా ప్రశ్నించలేని హీనస్థితిలో ప్రస్తుత మానవ జీవితాలు గడుస్తున్నాయని, మన శ్రమ దోపిడికి గురైతుందని, మన వనరులు దోపిడికి గురైతున్నాయని, మన ఆరోగ్యాలు క్షిణిస్తున్నాయని, మన భవిష్యత్ ను దోచుకుంటున్నారని, మన వ్యవసాయ రంగాన్ని కలుషితం చేసారని, మన రైతులను బిక్షగాళ్ల మాదిరి చేసారని, ఇంత దోపిడి కళ్ల ముందు జరుగుతున్నా మనం మౌనం గానే వుంటు మన బిడ్డల భవిష్యత్ ను సర్వనాశనం కావటానికి ప్రత్యక్షం గాను పరోక్షంగాను మన మౌనమే కారణం అని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.

అశాస్త్రీయ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తీవ్ర మైన ద్రోహానికి, అన్యాయానికి గురైందని, ఆంధ్రప్రదేశ్ వెన్నులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వెన్నులో గునపం దింపుతుంటే, మన తెలుగు సినిమా హీరోలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుంటు లక్షల కోట్లు అక్రమార్జనతో దారి చేసుకుంటు దోచుకుంటున్నారని, ఈ సినిమా వాళ్లు నివాసాలు, వ్యాపారాలు హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి పరచుకుంటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని,
ఈ తప్పుడు రాజకీయాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ని దోచుకోవాలనుకునే సినీ హీరోలను తెలంగాణా బిడ్డలు చెప్పుల తో చెంప చెల్లు మనిపిస్తారని, ఆంధ్రాలో ఈ సినీ మాయగాళ్లను స్వాగతిస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్యగోచరంగా వుందని, మరో 50 ఏళ్ళు పై బడి కోలుకోలేని విధంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా స్థితిలో వుందని, ఘోరమైన అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకు పోయి వుందని, నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పులు కూడా పుట్టని దారుణమైన స్థితికి చేరుకుందని, అప్పులు కోసం ప్రభుత్వ ఆస్తులను కుదువ పెడుతున్నారని, ప్రతి ఆంధ్రుడు తోను బాగా అతిగా మద్యం త్రాగిస్తాం, తద్వారా ఆర్థిక స్థితిని పెంచుకుంటాం అని రిజర్వ్ బ్యాంక్ ను నమ్మించి అప్పు తెచ్చుకునే చెత్త పాలనకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధపడుతోందని ఆయన ఆయన తెలిపారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని, రాజకీయ అనిచ్చితిని మెరుగు ఆంధ్రులు పరచుకోకుంటే ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన గడ్డు పరిస్థితులు తప్పవని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై నిరంతరం మోది సర్కార్ విషం కక్కుతుందని, ఆంధ్రా లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడితే తక్షణం రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కునిచేసే విధంగా రాజకీయ కుట్ర జరుగుతుందని, ఆంద్రుడుగా కొనసాగే నేతలు ఆంధ్రా బిజెపి పార్టి లో లేకపోవటం ఆంధ్రుల దురదృష్టం అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ విచారం వ్యక్త పరిచారు.