కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : స‌జ్జ‌ల‌

విధాత‌: హై కోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం,పరిషత్ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడింది.చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సింది..కానీ వాయిదా వేసుకుంటూ వచ్చారన్నారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్ర చేశారు అప్పటి SEC నిమ్మగడ్డ కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. గత మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రభుత్వంతో చర్చించకుండానే ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ వాయిదా వేశారు.ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు,ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నంచేశారు. టీడీపీ కార్యాలయం […]

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : స‌జ్జ‌ల‌

విధాత‌: హై కోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం,పరిషత్ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడింది.చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సింది..కానీ వాయిదా వేసుకుంటూ వచ్చారన్నారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్ర చేశారు అప్పటి SEC నిమ్మగడ్డ కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు.

గత మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రభుత్వంతో చర్చించకుండానే ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ వాయిదా వేశారు.ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు,ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నంచేశారు.

టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ పాటించారు,ప్రజాస్వామ్య ప్రక్రియను హత్య చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు.ఎన్నికల ప్రక్రియను, కౌంటింగ్‌కు అడ్డుపడ్డవారు..ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది.చంద్రబాబు ఓడితే నెపం EVMల మీద నెపం నెడతారని ఆయ‌న వెల్ల‌డించారు.