ఉద్యోగుల న్యాయపరమైన హక్కులకు సహకారం

విధాత‌ : ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలను అందిస్తుందని, ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగమని, రాష్ట్రంలో మెరుగైన పాలనా అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరంతర కృషిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్ సూర్య నారాయణ అధ్యక్షతన ఆదివారం […]

  • Publish Date - August 8, 2021 / 03:45 PM IST

విధాత‌ : ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలను అందిస్తుందని, ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగమని, రాష్ట్రంలో మెరుగైన పాలనా అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరంతర కృషిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్ సూర్య నారాయణ అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగిన మేధో మధన సదస్సును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు మెరుగైన సేవలను అందించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఏపీఎస్ ఏర్పాటు విషయంలో న్యాయబద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార రావు, ఉపాధ్యక్షులు కాజ. రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి . నాగసాయి , కోశాధికారి ఆర్. లక్ష్మణ , వివిధ శాఖలకు చెందిన గ్రూప్-1 అధికారులు పాల్గొన్నారు.