లోకేష్ చదువులకు సత్యం రామలింగరాజు స్పాన్సర్…మంత్రి సురేష్

విధాత‌:విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తి చిత్త‌ శుద్ధితో ఉందని, కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాకే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లను ఆయన కొట్టిపారేశారు. నారా లోకేష్‌కి ఉన్న‌ట్లు చంద్ర‌బాబు లాంటి తండ్రులు అంద‌రికి లేరని, లోకేష్ తండ్రికి సత్యం రామలింగరాజు దొరికినట్టు అందరికీ స్పాన్సర్లు దొరకరని ఎద్దేవా చేశారు. లోకేష్ చదువులకు సత్యం రామలింగరాజు స్పాన్సర్ చేశారని అన్నారు. పరీక్షల విషయంలో చంద్రబాబు, […]

లోకేష్ చదువులకు సత్యం రామలింగరాజు స్పాన్సర్…మంత్రి సురేష్

విధాత‌:విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తి చిత్త‌ శుద్ధితో ఉందని, కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాకే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లను ఆయన కొట్టిపారేశారు. నారా లోకేష్‌కి ఉన్న‌ట్లు చంద్ర‌బాబు లాంటి తండ్రులు అంద‌రికి లేరని, లోకేష్ తండ్రికి సత్యం రామలింగరాజు దొరికినట్టు అందరికీ స్పాన్సర్లు దొరకరని ఎద్దేవా చేశారు. లోకేష్ చదువులకు సత్యం రామలింగరాజు స్పాన్సర్ చేశారని అన్నారు. పరీక్షల విషయంలో చంద్రబాబు, లోకేష్.. ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు మంత్రి సురేష్.

  • విద్యార్థుల భవిష్యత్ కోసమే..

పరీక్షలు నిర్వహించి ఏదో ఒక రకంగా విద్యార్థులకు గ్రేడింగులు ఇచ్చి, ఉన్నత చదువులకు ఊతం ఇవ్వాలనే ప్రభుత్వం ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని తగ్గించిన సిలబస్ లతో ఇప్పటికే పరీక్షలకు ప్రశ్నాపత్రాలు కూడా రూపొందించామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

  • ఆ కాలేజీలపై కఠిన చర్యలు..

ఏపీలో పదోతరగతి పరీక్షలు కేవలం వాయిదా పడ్డాయంతే. టెన్త్ పరీక్షలు రద్దయ్యాయని, కేవలం ప్రకటన‌ మాత్రమే మిగిలుందని కొన్ని కాలేజీలు ప్రచారం మొదలు పెట్టాయి. టెన్త్ విద్యార్థులను ఇంటర్లో చేర్చుకుంటూ ఫీజులు వసూలు చేస్తూ, ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. దీనిపై స్పందించిన మంత్రి సురేష్. అడ్మిషన్లు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ఇతర రాష్ట్రాలతో పోలిక సరికాదు..

ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి కాబట్టి ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం లేదని ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేయడం లేదు కదా.. అని మీడియాని మంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం పక్కనపెట్టి, విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచించాలని సూచించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.