ప్రభుత్వంపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి: కేఆర్ సూర్యనారాయణ

విధాత,తిరుమల:ప్రభుత్వంపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి ఉందని ఏపీజీఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. నేటికీ 15 శాతం మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించాలని సంయమనం పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలన్నీ వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, పీఅర్సీ, డీఏ పెంపుపై సీఎం హామీచ్చారని.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను […]

ప్రభుత్వంపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి: కేఆర్ సూర్యనారాయణ

విధాత,తిరుమల:ప్రభుత్వంపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి ఉందని ఏపీజీఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. నేటికీ 15 శాతం మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించాలని సంయమనం పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలన్నీ వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీపీఎస్ రద్దు, పీఅర్సీ, డీఏ పెంపుపై సీఎం హామీచ్చారని.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. 3వేల కోట్ల రూపాయల మేర ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్, జీపీఏఫ్‌ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎఫ్‌యమ్‌యస్ విధానం వలన సమస్యలు వస్తూన్నాయని ఆర్దిక మంత్రి అంటున్నారని, మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు రద్దు చెయ్యకూడదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల మౌనాని ప్రభుత్వం అచేతనంగా తీసుకోవద్దని సూర్యనారాయణ హెచ్చరించారు.