సిరివెన్నెల సీతారామ శాస్త్రి, డైరెక్టర్ త్రివిక్రమ్‌ దగ్గరి బంధువులు.. వరుసకు ఏమవుతారంటే..!

విధాత: విధాత తలపున ప్రభవించినది.. అంటూ మొదటి పాటతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఇక లేరనే వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల.. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు.. ఎనలేనివనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామశాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆరోగ్యంగా తిరిగొస్తారని అనుకుంటున్న తరుణంలో… మరణించారని తెలియగానే ఆయన […]

సిరివెన్నెల సీతారామ శాస్త్రి,  డైరెక్టర్ త్రివిక్రమ్‌ దగ్గరి బంధువులు.. వరుసకు ఏమవుతారంటే..!

విధాత: విధాత తలపున ప్రభవించినది.. అంటూ మొదటి పాటతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఇక లేరనే వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల.. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే.

తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు.. ఎనలేనివనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామశాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆరోగ్యంగా తిరిగొస్తారని అనుకుంటున్న తరుణంలో… మరణించారని తెలియగానే ఆయన పాటలను ప్రేమించే కోట్లాది మంది అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆయన వ్యక్తిగత జీవితం, పాటల గురించి చర్చ నడుస్తున్న తరుణంలో… సినిమా పరిశ్రమలో సిరివెన్నెలకు సంబంధించిన సన్నిహితులు, బంధువుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సిరివెన్నెల దగ్గర బంధువనే విషయం చాలా మందికి తెలీదు.

వీరిద్దరికీ బంధుత్వం కలిసిన సందర్భం కూడా సినిమా సీన్‌ను తలపించేలా ఉంటుంది. త్రివిక్రమ్ ప్రతిభ, మంచితనం గురించి తెలుసుకున్న సిరివెన్నెల.. తన తమ్ముడి కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. తన ఇంట్లోనే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశాడు. అయితే పెళ్లిచూపుల్లో అనుకోని సందర్భం చోటు చేసుకుంది.

పెళ్లి చూపులకు వెళ్లిన త్రివిక్రమ్.. ఆమెను కాకుండా వాళ్ల చెల్లెలిని ఇష్టపడ్డాడు. ఈ విషయాన్ని సిరివెన్నెలకు తెలియజేయగా.. ముందుగా కొంచెం సంశయించారట. అయితే త్రివిక్రమ్‌ను ఎలాగైనా అల్లుడిని చేసుకోవాలనే ఉద్దేశంతో అందుకు అంగీకరించారట.

అలా సిరివెన్నెల సోదరుడి కుమార్తె సౌజన్యను వివాహం చేసుకుని.. వారి ఇంటికి త్రివిక్రమ్ అల్లుడయ్యాడు. అప్పటి నుంచి సిరివెన్నెల, త్రివిక్రమ్ మధ్య బంధం ఇంకా బలపడింది. అనంతర కాలంలో త్రివిక్రమ్.. సూపర్ హిట్ సినిమాలు తీసి.. స్టార్ డైరెక్టర్‌గా మారిన విషయం తెలిసిందే.