విధాత:కృష్ణా జిల్లా SP సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు బందరు ట్రాఫిక్ DSP ఆధ్వర్యంలో ,మచిలిపట్నం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ అధ్యక్షతన ఈరోజు మచిలిపట్నంలో రోడ్లపై సంచరిస్తున్న పశువుల వలన ప్రయాణీకులు మరియు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ ప్రాంతాల్లో గల పశువుల యజమానులకు R & B గెస్ట్ హౌసులో అవగాహన సదస్సు నిర్వహించారు.
మున్సిపల్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, R & B శాఖ అధికారులు, పట్టణంలో వివిధ డివిషన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో మొదటగా పట్టణంలో వివిధ ప్రాంతలనుండి వచ్చిన 150 మంది పశువుల యజమానుల సమస్యలు విన్న అధికారులు సానుకూలంగా స్పందించి తగిన పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం విచ్చలవిడిగా పశువుల సంచారం పై మున్సిపల్ కమిషనర్ గారు మరియు బందరు DSP గారు ఇతర అధికారులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించారు.
ఈ కార్యాచరణ లో భాగంగా
పట్టణంలో గల పశువులు అన్నింటికీ పశుసంవర్ధక శాఖ ద్వారా టాగింగ్ వేయించి తద్వారా యజమానుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.పట్టణంలో యజమాని లేని పశువుల ను గుర్తించి 10 రోజుల్లోగా వాటిని దూర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది.15 రోజుల్లోగా యజమానులు గల పశువుల ను గుర్తించి వారికి జరిమానా విధించడం జరుగుతుంది. అనంతరం వాటిని కూడా గో సంరక్షణ కేంద్రాలకు గాని అటవీ ప్రాంతాలకు గాని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం మైక్ అనౌన్మెంట్ ద్వారా పట్టణంలో అన్ని ప్రాంతాల ప్రజలకు పశువుల సంచారం వల్ల కలిగే ఇబ్బందులు గురించి తెలియపర్చడం జరుగుతుంది.త్వరలోనే వివిధ శాఖల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి రోడ్లపైకి విచ్చలవిడిగా పశువుల ను వదులుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.