AP | ఏపీలో హింసపై ఈసీకి సీఈవో నివేదిక
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆఫీస్ ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది

విధాత: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆఫీస్ ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ నియామకం చేపట్టనున్నది.
దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నది. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ప్రతి ఘటనలపైనా సిట్ ఈసీకి నివేదిక ఇవ్వనున్నది.
మళ్లీ అల్లర్లకు అవకాశం..జూన్ 19 వరకు కేంద్ర బలగాలు అక్కడే
ఏపీలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు నివురు గప్పిన నిప్పుల ఉండటం..పలుచోట్ల ఇంకా 144సెక్షన్ కొనసాగుతుండటం..మళ్లీ ఘర్షణలు తలెత్తే అవకాశముందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో జూన్ 19వరకు కేంద్ర బలగాలు అక్కడే ఉండాలని ఈసీ కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
జూన్ 4న ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను.. ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఏపీలో మళ్లీ అల్లర్లు చెలరేగవచ్చన్న కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీ వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఈసీ సూచించింది.