టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీ గా మారింది

తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు విధాత‌: టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీ గా మారింది,తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు అని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.బలహీన వర్గాలు అంబేద్కర్ ను దేవుడిలా పూజిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అన్ రిజర్వేడ్ స్థానాల్లో 75 కార్పొరేషన్లల్లో అధికశాతం బలహీన వర్గాలకు ఇచ్చారు. నేను అంబేద్కర్ గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారు.విచ్చిన్న ఆలోచలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని […]

  • Publish Date - August 21, 2021 / 12:11 PM IST

తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు

విధాత‌: టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీ గా మారింది,తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు అని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.బలహీన వర్గాలు అంబేద్కర్ ను దేవుడిలా పూజిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అన్ రిజర్వేడ్ స్థానాల్లో 75 కార్పొరేషన్లల్లో అధికశాతం బలహీన వర్గాలకు ఇచ్చారు.

నేను అంబేద్కర్ గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారు.విచ్చిన్న ఆలోచలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబుపై కేసు పెట్టాలా.? ఉరి తీయాలా?.బలహీన వర్గాలను జగన్ బలమైన వర్గంగా చేస్తున్నారు..
సంక్షేమ పథకాలను టీడీపీ జీర్ణించుకోలేక పోతుంది.పేదలకు ఇళ్ల‌ పట్టాలు ఇస్తున్నా కోర్టులకు వెళుతున్నారు.

చంద్రబాబు విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తా,అగ్నికుల క్షత్రియులను తరిమికొడతా అన్నారు.రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలు కలిసి కుటుంబంలా ఉన్నారు,కులాల్లో చిచ్ఛులు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.మీరు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా బలహీన వర్గాలు అంబేద్కర్ ను దేవుడిలా పూజిస్తాయి.. జగన్ కు జేజేలు పలుకుతాయి.