విధాత:విజయవాడ నగరంలోని గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చాడు. దీంతో చంద్రబాబును కలిసేందుకు వైసీపీ దళిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గొల్లపూడి 1 సెంటర్లలో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. మరోవైపు ఉమా నివాసానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, నాయకులు తరలివచ్చారు.