విధాత:దాచేపల్లి ఘటనలో మృతి చెందిన అలీసా కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు…. గుంటూరు జిజిహెచ్ వద్ద మృతుని కుటుంభాన్ని కలసి వివరాలు తెలుసుకున్న యరపతినేని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు… అధికార పార్టీనే అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తూ అమాయకులను వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు… తక్షణమే యువకుని మృతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.