సీపీఎస్ రద్దు ప్రభుత్వ పరిశీలనలో ఉంది- సజ్జల రామకృష్ణారెడ్డి
విధాత,అమరావతి: సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వం ఏర్పడగానే సబ్‌కమిటీ వేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలో గురువారం జరిగిన ఏపీఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖరరెడ్డి అభినందనసభలో ఆయన ప్రసంగించారు. సీపీఎస్ రద్దు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కొన్ని సమస్యలున్నా మాటిచ్చినందున సాధ్యాసాధ్యాలను చూడాలని సీఎం చెప్పారన్నారు.