ఒంటరి ఏనుగు కోసం గాలింపు.. ఇద్దరి ప్రాణాలు తీసుకున్న గజరాజం

ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు కోసం అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు అటవీ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది

ఒంటరి ఏనుగు కోసం గాలింపు.. ఇద్దరి ప్రాణాలు తీసుకున్న గజరాజం

విధాత : ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు కోసం అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు అటవీ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. వారం క్రితం అరగొండ సమీపంలో ఒకరిని, వెంగంపల్లి వద్ద మరో వ్యక్తిని పొట్టనబెట్టుకున్న ఒంటరి ఏనుగు కోసం వెతుకులాట సాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అది ఎటు నుంచి ఎటు పొతుందో గమనిస్తూ పరిసర గ్రామాల్లోని ప్రజలను హెచ్చరిస్తున్నారు. దానిని దారి మళ్లించడం లేదా అడవిలోకి తరిమేయడం కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.