ముగ్గురు మంత్రులకు మూడినట్టేనా.. జగన్ కేబినెట్ నుంచి ముగ్గురు అవుట్!
ఉన్నమాట: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పరిపాలన మూడడుగులు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న పూర్తి ఫలితాలు రావడం లేదు సరికదా ఎదురు తంతున్నాయ్. రెండున్నరేళ్ల తరువాత కేబినెట్లో కొందరిని మార్చేసి కొందరిని కొత్తగా తీసుకున్నారు..అయినా పెద్దగా ఫలితం లేనట్లుంది. మళ్ళీ ముగ్గుర్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తారు అంటున్నారు. పనితీరు బాలేని ముగ్గురు, నలుగురు మంత్రుల మీద వేటు వేయడానికి జగన్ రెడీ అయ్యారు అని […]

ఉన్నమాట: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పరిపాలన మూడడుగులు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న పూర్తి ఫలితాలు రావడం లేదు సరికదా ఎదురు తంతున్నాయ్. రెండున్నరేళ్ల తరువాత కేబినెట్లో కొందరిని మార్చేసి కొందరిని కొత్తగా తీసుకున్నారు..అయినా పెద్దగా ఫలితం లేనట్లుంది. మళ్ళీ ముగ్గుర్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తారు అంటున్నారు.
పనితీరు బాలేని ముగ్గురు, నలుగురు మంత్రుల మీద వేటు వేయడానికి జగన్ రెడీ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి. వారిలో ఇటీవలనే ప్రాధాన్యత పోష్టులోకి వచ్చిన ఓ మహిళా మంత్రి కూడా ఉన్నారని అంటున్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం జగన్ వారికి నేరుగా విషయం చెప్పారట. పదవిలోకి వచ్చి ఆయిదు నెలలు గడచిపోయినా శాఖాపరంగా పట్టు సాధించ లేకపోతున్నారని ఇకనైనా తీరు మార్చుకోవాలని జగన్ హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి.
అదే విధంగా కేవలం మంత్రి పదవి అంటే అధికారం హోదా మాత్రమే అని భావించి ఎంజాయ్ చేస్తున్న వారి వివరాలు సేకరించి వారిపై వేటు వేసేందుకు సిద్ధం అయ్యారని అంటున్నారు. మొన్నటి పునర్వ్యవస్థీకరణలో మంచి పోస్ట్ దక్కించుకున్న ఓ మహిళా మంత్రి ఈ ఆర్నెళ్లలో శాఖారపరంగా ఏ మాత్రం పట్టు సాధించేలేదని నివేదికలు చెబుతున్నాయి.
అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన కన్నబాబుని పక్కన పెట్టి మరీ అదే కాపు వర్గానికి చెందిన ఒక నేతకు పదవి ఇస్తే ఆయన సైతం తన శాఖ పట్ల పెద్దగా దృష్టి పెట్టడం చేయడం లేదని అరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా కేవలం కులం కారణంగా రాయలసేమలో ఒక మంత్రి ఇన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చినా ఆయనవల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదని సర్వే నివేదికలు చెబుతున్నాయట.
ఇలా కేవలం హోదా కోసం పదవుల్లో ఉన్నవారిని ఓ ముగ్గురు నలుగురిని తొలగిస్తారని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష టిడిపి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఏ ఒక్క మంత్రికూడా ముందుకు రాకపోవడం కూడా జగన్ లో అసంతృప్తికి కారణం అయింది. రానున్న నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ మంత్రులు కొందరికి ఉద్వాసన తప్పదని అంటున్నారు.