విధాత:చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్నీకా పురంలో విషాదం. గ్రామంలో ఇల్లు నిర్మాణం కోసం కంకరలోడ్ టిప్పర్ లిఫ్టుటింగ్ చేస్తుండగా, పైన ఉన్న హైటెన్షన్ వైరు టిప్పర్ బాడీకి తగలడం తో విద్యుత్ షాక్ తగలగా డ్రైవర్ మనోజ్ (25 ) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ ని కాపాడడానికి వెళ్లిన మరో ఇద్దరు యువకులు దొరబాబు (21) జ్యోతిష్ (19) కూడా అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…