సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. గురుమూర్తి వెంట డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, సంజీవయ్య తదితరులు ఉన్నారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనకు పట్టంగట్టి […]

సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.

గురుమూర్తి వెంట డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, సంజీవయ్య తదితరులు ఉన్నారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు.

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్‌ శాతం తగ్గిపోయినా వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం.