కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం తన 116ఏళ్ల వయసులోనూ మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకున్న తమిళనాడుకు చెందిన శతాధిక వృద్దురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ దర్శన భాగ్యం కల్పించింది. 116ఏళ్ల వయసులోనూ తిరుమల కొండపైకి మెట్ల మార్గంలో వెలుతున్న నవనీతమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు స్పందించారు. శ్రీవారి భక్తురాలు నవనీతమ్మతో పాటు, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం చేయించారు.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్ ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ కి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ గారి మనవడు దిక్పతీ మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు మాట్లాడుతూ…నవనీతమ్మ అనితర భక్తిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని తెలిపారు.
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు… pic.twitter.com/3Cbu2loCVX
— B R Naidu (@BollineniRNaidu) July 6, 2026
