విధాత: నేతల ఆడియో టేపులపై విచారణ అవసరమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘‘ఆ మాటలు తమవి కావని నేతలు అంటున్నారు. నేతల వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేతల ఆడియో టేపుల ఘటనపై విచారణ కోరతాం. మహిళా కమిషన్ తరఫున సమాచారం తెప్పించుకుంటాం. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు. రమ్య ఘటనపై తెదేపా 21రోజుల డెడ్‌లైన్ సరికాదు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇటీవల పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో నేత అంబటి రాంబాబులకు సంబంధించిన ఆడియో టేపు లీకవడం కలకలం రేపిన విషయం తెలసిందే.