వెంకయ్య నాయుడు… మీరు రైతు బిడ్డేనా? – సీపీఐ రామకృష్ణ.

విధాత:నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలకుపైగా ఢిల్లీ నలుమూలల సాగుతున్న రైతుల ఘోష మీకు వినిపించలేదా?కరోనా విపత్కర కాలంలో వలస కూలీల వెతలు, 40 లక్షల మంది మృతి, ఆక్సిజన్ అందక జరిగిన మరణాలు మిమ్మల్ని కదిలించలేక పోయాయా?ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అమలులో కేంద్రం చేసిన ద్రోహం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాల్లో మీ స్పందన కరువైందేం?అబలల ఆక్రందనలు, అధిక ధరలు, ఆకలి కేకలు మీ హృదయాన్ని […]

వెంకయ్య నాయుడు… మీరు రైతు బిడ్డేనా? – సీపీఐ  రామకృష్ణ.

విధాత:నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలకుపైగా ఢిల్లీ నలుమూలల సాగుతున్న రైతుల ఘోష మీకు వినిపించలేదా?కరోనా విపత్కర కాలంలో వలస కూలీల వెతలు, 40 లక్షల మంది మృతి, ఆక్సిజన్ అందక జరిగిన మరణాలు మిమ్మల్ని కదిలించలేక పోయాయా?ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అమలులో కేంద్రం చేసిన ద్రోహం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాల్లో మీ స్పందన కరువైందేం?అబలల ఆక్రందనలు, అధిక ధరలు, ఆకలి కేకలు మీ హృదయాన్ని ఏనాడు ఇసుమంతైనా కదిలించలేదే?వెంకయ్య నాయుడు మరి ఇప్పుడెందుకు ఈ కన్నీళ్లు?కేవలం రాజ్యసభ సజావుగా సాగడంలేదని కంటతడి పెట్టడం ఎబ్బెట్టుగా ఉంది.

  • రామకృష్ణ.