ప్రయాణికులకు అలెర్ట్..! విజయవాడ డివిజన్‌లో వారం పాటు ఈ రైళ్లు రద్దు..!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో వారం రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతుండంతో కొన్నింటిని రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ నెల 12 వరకు గుంటూరు – విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి – విశాఖ (07466) మెము, విశాఖ – రాజమండ్రి (07467) మెము, కాకినాడ పోర్టు – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17267), విశాఖపట్నం – కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (17268) రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12717-12718), గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243), మచిలీపట్నం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17219) రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 13 వరకు విశాఖ – గుంటూరు (రైలు నెం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే, విశాఖపట్నం- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220), రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) రైలును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram