శ్రీశైలం ను ముట్టడిస్తాం.. విష్ణువర్ధన్ రెడ్డి

విధాత:తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్ వారసులుగా పాలకులు వ్యవహరిస్తున్నారు.. ఈ విషయం ఇప్పటికె కోర్టులో ఉంది.తెలుగు అకాడమీ ని రద్దు చేసి ఖునీ చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాం.భారత ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలుగులో చదువుకొని వచ్చినవారే.కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది.తెలంగాణ, ఏపీ తీసుకుంటున్న నిర్ణయాల తో అన్యాయం జరుగుతోంది. తెలంగాణ నష్టం జరిగే నిర్ణయాలు తీసుకుంటే సీఎం చేతకాని తనం తో ఉన్నారు.రాయలసీమ హక్కులను ఫణంగా పెడుతున్నారు. అంతర్ రాష్ట్ర […]

శ్రీశైలం ను ముట్టడిస్తాం.. విష్ణువర్ధన్ రెడ్డి

విధాత:తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్ వారసులుగా పాలకులు వ్యవహరిస్తున్నారు.. ఈ విషయం ఇప్పటికె కోర్టులో ఉంది.తెలుగు అకాడమీ ని రద్దు చేసి ఖునీ చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాం.భారత ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలుగులో చదువుకొని వచ్చినవారే.కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది.తెలంగాణ, ఏపీ తీసుకుంటున్న నిర్ణయాల తో అన్యాయం జరుగుతోంది. తెలంగాణ నష్టం జరిగే నిర్ణయాలు తీసుకుంటే సీఎం చేతకాని తనం తో ఉన్నారు.రాయలసీమ హక్కులను ఫణంగా పెడుతున్నారు. అంతర్ రాష్ట్ర జలవివాదాల పై తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టు లను, విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు ఆపడం లేదు.తెలంగాణ లో పార్టీలు కేసీఆర్ విధానాలను తప్పు పడుతుంటే… ప్రభుత్వం ఏం చేస్తోంది. ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నాం.రాయలసీమ లో పెండింగ్ ప్రాజెక్టులు, హక్కుల ను సీఎం గాలికి వదిలేశారు.సీమలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమం లోకి రండి.. ప్రజలు గెలిపిస్తారు.తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేస్తోంది. అక్కడి ఆస్తులను గాలికి వదిలేశారు. హైదరాబాద్ లో రాజధానిగా ఉమ్మడి హక్కులు ఉన్నాయి.ఇద్దరు సీఎం ల మధ్య రహస్య ఒప్పందం ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో అవసరం అయితే శ్రీశైలం ను ముట్టడిస్తాం.ఇతర పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి… జల వివాదం పై నోరు విప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.