జగన్-షర్మిల ఆస్తులపై వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన

జగన్, షర్మిల ఆస్తులపై వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. కుటుంబ ఆస్తుల పంపకం జరగలేదని, షర్మిలకు రావాల్సిన వాటా న్యాయంగానే ఉందని తెలిపారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Mar 20, 2026, 4:13 pm IST
Read Time: 4 mins
జగన్-షర్మిల ఆస్తులపై వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన

విధాత, హైదరాబాద్: తన కుమారుడు వైఎస్. జగన్, కుమార్తె షర్మిల ఆస్తులపై తల్లి వైఎస్. విజయమ్మ కీలక ప్రకటన చేశారు. 2009లో వైఎస్ఆర్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేనన్న విజయమ్మ తన ప్రకటనలో స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కుటుంబ ఆస్తులపై తన స్టేట్మెంట్ ను నోటరీ చేసి విజయమ్మ విడుదల చేశారు. తమ కుటుంబంలో ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని అందులో విజయమ్మ స్పష్టంగా వెల్లడించారు.

అన్ని ఆస్తులను నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైయస్సార్ ఉద్దేశం.. ఇది ఆయన ఆదేశం కూడా అని, అది దగ్గరి వారందిరికి తెలిసిందేనని విజయమ్మ పేర్కొన్నారు. ఎంఓయూ లో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా అమెకు చెందాల్సినవేనని, అందుకే జగన్ ఎంఓయూ రాశాడు అని గుర్తు చేశారు. నిజానికి షర్మిలకు జగన్ తక్కువే రాశాడు… సరస్వతి సిమెంట్ తో సహా ఎంఓయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని తెలిపారు. జగన్ ఇచ్చాను అని చెప్తున్నా డబ్బు.. షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెంట్ మాత్రమే అని, ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు అని, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను అని విజయయ్మ తన నోటరీ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు? అని, మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం అని స్పష్టం చేశారు. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానని, పదేపదే మీడియాలో ఈ అంశాలు ప్రస్తావించొద్దని వేడుకుంటున్నాను అని, దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమేనని విజయమ్మ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

ప్రపంచంలో అత్యంత ఖరీదైన జంతువులు ఇవే.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బడ్జెట్ పై చెవుల్లో పువ్వులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన