వైస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
విధాత: స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో ఇటీవల ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించగా, మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు.. కాపు రెండు, కమ్మ రెండు, రెడ్డి రెండు, క్షత్రియ ఒక స్థానాన్ని కేటాయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు.. వరుదు […]

విధాత: స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలలో ఇటీవల ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించగా, మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు.. కాపు రెండు, కమ్మ రెండు, రెడ్డి రెండు, క్షత్రియ ఒక స్థానాన్ని కేటాయించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు..
వరుదు కళ్యాణి (విశాఖపట్నం)
ఇందుకూరు రఘురాజు (విజయనగరం)
వంశీకృష్ణ యాదవ్ (విశాఖపట్నం)
అనంత ఉదయ్‌భాస్కర్ (తూర్పుగోదావరి)
మొండితోక అరుణ్‌కుమార్ (కృష్ణా)
తలశిల రఘురాం (కృష్ణా)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
తూమాటి మాధవరావు (ప్రకాశం)
మూరుగుడు హన్మంతరావు (గుంటూరు)
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)
వై.శివరామిరెడ్డి (అనంతపురం)