Beauty tips | మచ్చలులేని మెరిసే చర్మం కోసం ఇంట్లోనే ఫేస్ సీరం తయారు చేసుకోండిలా..!
Beauty tips : మీ ముఖంపై అన్నీ ముదురు రంగు మచ్చలు ఉన్నాయా..? ఆ మచ్చలను పోగొట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారా..? మచ్చలులేని (Spotless) మెరిసే చర్మం కోసం (Glowing skin ) కోసం ఉబలాటపడుతున్నారా..? అయినా ఫలితం లేకుండా పోయిందా..? అయితే ఈ హోమ్ మేడ్ ఫేస్ సీరం మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రాత్రి ఈ సీరంను ముఖానికి రాసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మరి ఆలస్యం దేనికి ఫేస్ సీరంను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

- ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం (rice), ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు (Anise seeds) వేసి, అరకప్పు నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో నానబెట్టుకున్న బియ్యం, సోంపును నీళ్లతో సహా వేసుకోవాలి. వాటికి మూడు కీర దోసకాయ స్లైసెలు కలుపుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జాలి సాయంతో జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.
- ఈ జ్యూస్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ (Olive oil), ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ (Aloevera gel) వేసుకుని బాగా మిక్స్ చేస్తే ఫేస్ సీరం రెడీ అవుతుంది. ఈ సీరంను ఒక బాటిల్‌లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి నీళ్లతో కడుక్కోవాలి. తర్వాత తయారు చేసి పెట్టుకున్న సీరంను ముఖానికి రాసుకుని పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి. నిత్యం ఈ న్యాచురల్ సీరంను వాడితే ముఖంపై ఎంత మొండి మచ్చలు ఉన్నా క్రమంగా తగ్గుపోతాయి.
- కొద్ది రోజుల్లోనే మచ్చలులేని మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. చర్మంపై ముడతలు ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి. చర్మాన్ని టైట్‌గా మారుస్తుంది. అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram