రోడ్డు ప్ర‌మాదం.. కూతుర్ని చూడ‌కుండానే…

విధాత: మిర్యాలగూడకు చెందిన దైద వెంకన్న, భార్య లక్ష్మణ రేఖతో కలిసి ద్విచక్ర వాహనం పై నల్గొండ కు వెళుతుండగా లారీ ఢీకొట్టిన ప్రమాదంలో బైక్ పై వెనక ఉన్న లక్ష్మణ రేఖ అక్కడికక్కడే మృతి చెందింది. వెంకన్నకు సైతం తీవ్ర గాయాలు కావ‌డంతో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. నల్గొండలో ఇంటర్ చదువుతున్న తమ కూతుర్ని చూసేందుకు వారు బైక్ పై వస్తుండగా కుక్కడం వద్దకు రాగానే వెనక నుండి లారీ బలంగా ఢీకొట్టడంతో పాటు కొద్ది […]

  • Publish Date - February 12, 2023 / 02:33 PM IST

విధాత: మిర్యాలగూడకు చెందిన దైద వెంకన్న, భార్య లక్ష్మణ రేఖతో కలిసి ద్విచక్ర వాహనం పై నల్గొండ కు వెళుతుండగా లారీ ఢీకొట్టిన ప్రమాదంలో బైక్ పై వెనక ఉన్న లక్ష్మణ రేఖ అక్కడికక్కడే మృతి చెందింది. వెంకన్నకు సైతం తీవ్ర గాయాలు కావ‌డంతో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.

నల్గొండలో ఇంటర్ చదువుతున్న తమ కూతుర్ని చూసేందుకు వారు బైక్ పై వస్తుండగా కుక్కడం వద్దకు రాగానే వెనక నుండి లారీ బలంగా ఢీకొట్టడంతో పాటు కొద్ది దూరం లాక్కెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భార్య అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా, భ‌ర్త‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.