స్క్రూ డ్రైవర్‌తో భార్యను పొడిచి చంపిన భర్త.. ఆమె శరీరంపై 41 గాయాలు
ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. తనకు డ్రగ్స్ ఇచ్చిందనే అనుమానంతో భార్యను స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన టర్కీష్ హోటల్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన ఓ 28 ఏండ్ల వ్యక్తి తన భార్య(26)తో కలిసి ఇస్తాంబుల్‌కు నవంబర్ 11న బయల్దేరాడు. నవంబర్ 14న టర్కీ చేరుకుని, అక్కడున్న ఓ హోటల్‌లో దిగారు. ఇక మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆ దంపతులు ఉన్న గదిలో నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. దీంతో హోటల్ సిబ్బంది అప్రమత్తమై, పోలీసులకు సమాచారం అందించారు. గది తలుపులు తెరిచిచూడగా, మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతన్ని పోలీసులు పట్టుకున్నారు.
భర్తను పోలీసులు విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. స్క్రూడ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపానని, అది వాష్‌రూమ్‌లో పడేసినట్లు తెలిపాడు. అయితే తన భార్య తనకు డ్రగ్స్ ఇవ్వడంతోనే హత్య చేసినట్లు పేర్కొన్నాడు. కానీ ఆ గదిలో ఎక్కడా కూడా డ్రగ్స్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నిందితుడు మానసిక రుగ్మలతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అందుకు మెడిసిన్స్ తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram