టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రకుల్ వివాహం జరగగా, ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు పెళ్లి పీటలెక్కేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. వెంకటేష్ కూతురు పెళ్ళికి రెడీ కాగా, వాటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఓ కుమారుడు ఉండగా, మొదటి కూతురికి చాలా రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇప్పుడు రెండో కూతురు కూడా పెళ్ళికి రెడీ అయ్యింది.. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్నట్లు సమాచారం.
గురువారం వెంకటేష్ రెండో కూతురు హవ్య వాహిని మెహందీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి తన కూతురితో హాజరైంది. నమ్రతా శిరోద్కర్‌తో పాటు కూతురు సితార పలు ఫొటోలకి పోజులిచ్చారు. వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వెంకటేష్- మహేష్ బాబు మధ్య మంచి స్నేహ బంధం ఉన్న నేపథ్యంలో నమ్రతా హాజరైనట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నందున హాజరు కానట్టు టాక్. ఇక హవ్య వాహిని వివాహం ఈ రోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సింపుల్‌గా జరిపిస్తున్నట్టు తెలుస్తుంది. హవ్యవాహిని వేడుకకు కొద్దిమంది టాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రమే హాజరు అవుతారని తెలుస్తుంది.
ఇక గతేడాది అక్టోబర్‌లో హవ్యవాహిని నిశ్చితార్థం జరగగా,ఈ వేడుకకి చిరంజీవి, మహేష్ బాబు, నాగ చైతన్య, దగ్గుబాటి రానా, సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇప్పుడు పెళ్లికి ఎవరు హాజరు కాబోతారనేది సస్పెన్స్‌గా మారింది. వెంకటేష్‌కి నలుగురు కూతుళ్లు ఉండగా, ఆయన పెద్ద కూతురు ఆశ్రిత వివాహం 2019లో జైపూర్ లో జరిగింది. హవ్య వాహిని వివాహం హైదరాబాద్‌లో సింపుల్‌గా జరిపిస్తున్నట్టు తెలుస్తుండగా,అందుకు కారణం ఏంటనేది తెలియదు.