టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్టులో జపనీస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం
అగ్నిప్రమాదానికి గురైంది. రన్‌వేపై ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అది మంటల్లో చిక్కకున్నది. స్థానిక కాలమానం
ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. విమానం కిటీకీల నుంచి, దిగువ నుంచి మంటలు ఎగసిపడుతున్న
వీడియోలను స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో కోస్ట్‌గార్డ్ ప్లేన్‌ను అది
ఢీకొనదన్న ఎన్‌హెచ్‌కే వార్తా సంస్థ అధికారులను ఉటంకిస్తూ తెలిపింది.
ఘటన జరిగిన సమయంలో అందులో 379 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారందరినీ వెంటనే
విమానం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టు తెలుస్తున్నది. ఘటనలో జరిగిన నష్టంపై తాము అంచనా వేస్తున్నమని
ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. జపనీస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 516 ఫ్లైట్ స్థానిక కాలమానం ప్రకారం
సాయంత్రం నాలుగు గంటలకు న్యూ చిటోస్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. సాయంత్రం 5.40 గంటలకు హనేడా ఎయిర్‌పోర్టుకు
చేరుకోవాల్సి ఉన్నది. అగ్నికీలలు వెలువడి వెంటనే అప్రమత్తమైన అధికారులు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలను
విమానం వద్దకు తరలించి మంటలు ఆర్పివేశారు. హనేడా ఎయిర్‌పోర్టు.. జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో
ఒకటి.