ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఆటోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు

ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఆటోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు. బీఆరెస్‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్‌ యూసఫ్ గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిగా కేటీఆర్ ఆటోలో ప్రయాణించడంతో ఆయన వెంట ఉండే సెక్యూర్టీ, పార్టీ నాయకులు సైతం వెనుక మరో ఆటోలలో ఆయనను అనుసరించారు.