మహాలక్ష్మీ భర్తకి ఏమైంది.. శ్వాస తీసుకోలేని పరిస్థితులలో ఐసీయూలో చికిత్స

మహాలక్ష్మి.. ఈ పేరు కొన్ని నెలల క్రితం చాలా ఫేమస్ అయింది. కోలీవుడ్ బుల్లితెర నటి అయిన మహాలక్ష్మీ నిర్మాత రవిచందర్‌ని పెళ్లి చేసుకుంది. మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందన్న ప్రచారం బాగా మొదలు కావడం, వారు దానిపై క్లారిటీ ఇస్తూ తెగ వార్తలలో నిలిచారు. అనంతరం నిర్మాత రవీందర్ ఛీటింగ్ కేసులో జైలుకు వెళ్లడం, అలాగే మహాలక్ష్మి కూడా అతనితో విడాకులు తీసుకుంటుందని ప్రచారం సాగడం వంటివి కూడా మనం చూశాం. అయితే ఎవరెన్ని అన్నా, తమ గురించి ఎంత ట్రోల్ చేసిన కూడా ఆ జంట మాత్రం అన్యోన్యంగా కాపురం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు.
అయితే రవీందర్ ఇటీవల యూట్యూబ్‌లో ఎక్కువగా వీడియోలు చేస్తున్నాడు. తమిళ బిగ్ బాస్‌పై కూడా తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ అదరగొడుతున్నాడు. అయితే తాజాగా రవీందర్ తన యూట్యూబ్‌లో చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆక్సిజన్ ట్యూబ్‌తో కనిపించడమే దీనికి కారణం. అనారోగ్య పరిస్థితుల్లోనూ ఆయన బిగ్ బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ అందరిని షాక్‌కి గురి చేశాడు. రవీందర్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా, ఆ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్లాడు. దీంతో ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దాదాపు వారం రోజుల పాటు ఈ చికిత్స జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది.
ఫొటోలో రవీందర్ ఆక్సీజన్ మాస్క్‌తో కనిపించాడు. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిగా ఉందని, త్వరలోనే కోలుకొని మళ్లీ మీ ముందుకు వస్తానని కూడా రవీందర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆక్సీజన్ సహకరించనప్పుడు ఎందుకు వీడియోలు చేస్తున్నావు. విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని పలువురు సూచనలు చేస్తున్నారు. మహాలక్ష్మీ ఇలాంటి సమయంలోనే నువ్వు భర్తకి అండగా ఉండాలి అంటూ కొందరు సూచనలు చేస్తున్నారు.