మిర్యాలగూడలో భారీగా గోవా మద్యం పట్టివేత

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మిర్యాలగూడలో పట్టుకున్నారు.

మిర్యాలగూడలో భారీగా గోవా మద్యం పట్టివేత

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగరలోని ఒక ఇంటిపై గురువారం ఎక్సైజ్ అధికారులు దాడి చేసి, భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో గోవాలో తయారు చేసిన 750 ఎంఎల్ బ్లెండర్ ప్రైడ్ విస్కీ 22 ఫుల్ బాటిళ్లు, 750 ఎంఎల్ ఏంటి క్వటీ ఫుల్ బాటిళ్లు17, 750 సిగ్నేచర్ విస్కీ 4 ఫుల్ బాటిల్స్, 750 ఎంఎల్ ఓల్డ్ మంక్ రమ్ 2 ఫుల్ బాటిల్స్ మొత్తం 45 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరరెడ్డి తెలిపారు.


గోవా నుండి అతి తక్కువ ధరకు తీసుకొచ్చి మిర్యాలగూడలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్న పున్నా శివ, పున్నా రాకేష్ లపై కేసు నమోదు చేశామని, వారిలో పున్నా శివను అరెస్టు చేసి స్థానిక జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, జ్యూడిషీయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశించారని తెలిపారు. మరో నిందితుడు పున్నా రాకేష్ పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్టు చేస్తామన్నారు. దాడుల్లో ఎస్ఐలు డీ రామకృష్ణ, ఎస్కె పర్వీన్, లావణ్య, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.