విడాకుల తర్వాత హీరోయిన్గా నిహారిక తొలి సినిమాపై అనౌన్స్మెంట్..ఇదైన హిట్టిస్తుందా..!

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారికపై ఒకప్పుడు జనాల్లో మంచి అభిప్రాయం ఉండేది. వెబ్ సిరీస్‌లు చేస్తున్న సమయంలో నిహారికని చాలా మంది ఇష్టపడేవారు. అయితే ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి నిహారిక ఎంట్రీని ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ హీరోయిన్ గా మారి పంతం నెగ్గించుకుంది. ఒక మనసు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే నిరాశపరచింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించింది. ఇవేమి నిహారికకి కలిసి రాలేదు. దాంతో చేసేదేమీ లేక పెళ్లి చేసుకుంది.
గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో 2020లో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిపించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన విడాకులపై నోరు విప్పిన నిహారిక…పెళ్ళయాక కూడా ఆమె నటన కొనసాగించాలి అనుకున్నారు. అందుకు అత్తింటి వారు ఒప్పుకోలేదని, అది తన జాబ్ అని పెళ్ళైతే నటన ఎందుకు మానేయాలని నిహారిక ఈ ఇంటర్వ్యూలో గట్టిగా అడిగింది. అయితే ఎట్టకేలకు విడాకులు తీసుకున్న నిహారిక ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది.
నిర్మాతగా రాణించే ప్రయత్నంలో ఇటీవల ఒక ఆఫీస్ ఓపెన్ చేసింది. నిర్మాతగా బడ్జెట్ చిత్రాలు, సీరీస్లు నిర్మిస్తుంది. అలాగే నటిగా కొనసాగాలి అనుకుంటుంది. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్గా ఒక సినిమా చేసేందుకు సిద్ధమైంది. విడాకుల తర్వాత నిహారిక హీరోయిన్గా ఒక మూవీ ప్రకటన జరిగింది. ఆమె మద్రాస్ కారన్ టైటిల్ తో ఈ మలయాళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకుడు. నిహారికకు ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెబుతూ పోస్టర్ విడుదల చేశారు. మొదటి ఇన్నింగ్స్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ అయిన ఆయనకి ఏ మాత్రం కలిసి వస్తుందో చూడాలి.