వామ్మో.. సుకుమార్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా..టాలెంటెడ్ డైరెక్టర్ ఫ్యామిలీ పిక్స్ వైరల్

లెక్కల మాస్టారు సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చేసినవి తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే చిత్రాలు చేశాడు. పుష్ప చిత్రంతో సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది. అల్లు అర్జున్‌ని డిఫరెంట్‌గా చూపించి అదరహో అనిపించాడు. పుష్ప చిత్రం మంచి హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప2 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా సుకుమార్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో ఏ చిత్రం తెరకెక్కుతోంది. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కి సన్నాహకాలు చేస్తున్నారు సుకుమార్.
అయితే సుకుమార్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఫ్యామిలీకి కూడా కొంత సమయం తప్పక కేటాయిస్తారు. తన పిల్లలని, భార్యని సుకుమార్ ఎంతగానో ప్రేమిస్తారు. గతంలో ఓ సారి సుకుమార్ తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అయితే తాజాగా తన ముద్దుల కుమార్తె సుకృతి వేణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సుకుమార్. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సుకుమార్ సతీమణిని పిల్లలని చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సుకుమార్ కుమార్తె సుకృతి అందరి దృష్టిని ఆకర్షించగా, ఆమె రానున్న రోజులలో హీరోయిన్ కావడం పక్కా అంటూ కొందరు జోస్యాలు చెబుతున్నారు. హీరోయిన్ క్వాలిటీస్ సుకృతిలో చాలా ఉన్నాయని ఏదో ఒక రోజు సుకుమార్ తన కూతురిని హీరోయిన్‌గా చేయడం ఖాయం అని అంటున్నారు. పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం నుంచే సుకృతి సెలేబ్రిటిగా మారిపోయింది. పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుకృతి తన తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడి తెగ హైలైట్ అయింది. ఇక ఇప్పుడు తన బర్త్‌డేతో మరింత అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక బర్త్ డే రోజు సుకృతికి సుకుమార్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌లు ఇచ్చినట్టు తెలుస్తుంది.