29, 30 తేదీల్లో తెలంగాణ బడులకు ఎన్నికల సెలవులు..!
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభకు ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 29, 30వ తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. 80 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 29, 30 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనుంది విద్యాశాఖ.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram