India vs England| ఇంగ్లాండ్ పై ఐదో టెస్టులో ఇండియా ఘన విజయం

India vs England| ఇంగ్లాండ్ పై ఐదో టెస్టులో ఇండియా ఘన విజయం

India vs England : ఇంగ్లాండ్( England)తో ఓవల్(Oval)వేదికగా జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్(Five-Match Test Series)లో ఆఖరిదైన ఐదవ టెస్టు(5th Test)లో ఉత్కంఠ భరితంగా సాగిన క్లైమాక్స్ ఫైట్ లో 6 పరుగుల(6 runs) తో ఇండియా(India) అధ్బుత విజయం(thrilling victory)సాధించింది. ఈ టెస్టులో విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ డ్రా (Drawn)చేసుకోగలింది. సోమవారం ఓవల్ టెస్టులో ఐదవ రోజు ఆటలో 35పరుగులు చేస్తే ఇంగ్లాండ్..నాలుగు వికెట్లు పడగొడితే ఇండియా గెలిచే పరిస్థితి ఉండగా..ఇండియా బౌలర్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఇంకా ఆరు పరుగులు ఉండగానే 367పరుగులకు ఆలౌట్ చేశారు. ఆఖరి వికెట్ గా సిరాజ్ బౌలింగ్ లో ఆట్కిన్సన్(17) బౌల్డ్ అవ్వడంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నాంటాయి. మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 4వికెట్లు, ఆకాశ్ దీప్ 1 వికెట్ పడగొట్టారు.

ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 224పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా టీమ్ లో కరుణ్ నాయర్ (57) టాప్ స్కోరర్ గా నిలువగా..ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5, టంగ్ 3, వోక్స్ 1 వికెట్ సాధించారు. తర్వాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 247పరుగులు చేసింది. క్రాలే(64), బ్రూక్(53) పరుగులతో రాణించగా..టీమిండియా బౌలర్లలో సిరాజ్ 4, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్ 1వికెట్ సాధించారు. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా యశస్వీ జైశ్వాల్(118) సెంచరీ, ఆకాశ్ దీప్(66), జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) అర్ధసెంచరీలతో 396పరుగులు చేసింది. టంగ్ 5, అట్కిన్స్ 3, ఓవర్టన్ 2వికెట్లు సాధించారు. 374పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ బ్రూక్(111), రూట్(105) సెంచరీలతో.. డకెట్(54) హాఫ్ సెంచరతో రాణించినప్పటికి విజయానికి 6 పరుగుల దూరంలో ఆలౌట్ అయి ఓటమి పాలైంది.

టెస్టు క్రికెట్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటర్మైంట్..సీనియర్లు పూజారా, రహానే వంటి ఆటగాళ్లు జట్టుకు దూరమవ్వడం..స్టార్ బౌలర్ బూమ్రా అన్ని టెస్టులు ఆడకపోవడం మధ్య టీమిండియా యువ జట్టు ఐదు మ్యాచ్ ల అండర్సన్-టెండుల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో విజయం సంగతేమోగాని..ఘోర పరాజయాలు మూట కట్టుకోకపోతే చాలనుకున్నారు. కాని సిరీస్ లోని అన్ని టెస్టులు కూడా ఇంగ్లాండ్ తో నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ తలపడిన యువ భారత్ ఆటగాళ్లు అధ్బుతమే సృషించారు. ఈ క్రమంలో గిల్, రాహుల్, జైశ్వాల్, జడేజా, బూమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, పంత్ లు అనేక వ్యక్తిగత రికార్డులను సైతం సాధించారు. తొలి టెస్టు, మూడో టెస్టును ఇంగ్లాండ్ గెలుచుకోగా, రెండు, ఐదవ టెస్టులను ఇండియా గెలుచుకోగా..నాల్గవ టెస్టు డ్రాగా ముగిసింది. నిజానికి మూడో టెస్టులోనూ టీమిండియా గెలవాల్సిన స్థితిలో చివరి క్షణాల్లో ఓడిపోయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సర్కిల్ లో భాగంగా జరిగిన ఈ టెస్టు సిరీస్ లో ఐదు టెస్టులు కూడా ఆట ఆఖరీ రోజు వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన తీరు టెస్టు క్రికెట్ కొత్త ఉత్సాహాన్ని అందిచినట్లయ్యింది.