Aadhar – Pan Link | ఆదాయపు పన్ను చెల్లింపుదారులా..? మరి ఆధార్‌తో పాన్ లింక్ చేశారా..?
Aadhar - Pan Link | ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కీలక సూచనలు చేసింది. పాన్‌తో ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనని చెప్పింది. లేకపోతే టీడీఎస్ అధికంగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

Aadhar – Pan Link | ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కీలక సూచనలు చేసింది. పాన్‌తో ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనని చెప్పింది. లేకపోతే టీడీఎస్ అధికంగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు ఖచ్చితంగా మే 31 వరకు ఆధార్-పాన్ లింక్ పూర్తి చేయాలని పేర్కొంది. గడువులోగా పూర్తి చేయకపోతే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 206 ఏఏ, 206 సీసీ కింద పన్ను చెల్లింపుదారులు అధిక పన్ను, టీడీఎస్ ఎక్కువగా కట్టాల్సి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.
ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ సైతం పని చేయదని.. పన్ను కోతలు అధికంగా ఉంటాయని పేర్కొంది. ఆధార్ – పాన్ అనుసంధానంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఏప్రిల్ 23న సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రక్రియ పూర్తి చేయకపోతే ట్యాక్స్ పేయర్స్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. గడువు రెండురోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఆదాయ పన్నుశాఖ మరోసారి పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్ జారీ చేసింది.
ఆధార్‌తో పాన్ ఎలా లింక్ చేయాలంటే..
మొదట ఆదాయపు పన్నుశాఖ https://www.incometax.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్‌లో ఎడమ వైపు కినిపించే క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వాలిడేట్ బటన్‌పై క్లిక్ చేయాలి. పాన్, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్‌పై క్లిక్ చేయాలి. దాంతో ఆధార్- పాన్ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఆధార్ పాన్ లింక్ స్టేటస్ చెక్ చేయండిలా..
ఆధార్ – పాన్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసిన స్టేటస్‌ను తెలుసుకోవాలనుకుంటే అదే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎడమవైపు క్విక్ లింక్స్ సెక్షన్‌లో లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. ఆధార్, పాన్ వివరాలు ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి అప్పుడు స్టేటస్ డిస్ అవుతుంది. లింకింగ్ ప్రక్రియ పూర్తయి ఉంటే సక్సెస్ ఫుల్ అని వస్తుంది. లేదంటే అండర్ ప్రాసెసింగ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.