CIBIL Score | కార్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా..? మరి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో తెలుసా..?
CIBIL Score | దేశంలో ప్రముఖ క్రెడిట్ బ్యూరోల్లో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (India) ఒకటి. కార్ లోన్ ఇచ్చేందుకు సిబిల్, క్రెడిట్ స్కోర్‌ని బ్యాంకులు, ఫైన్సా్ సంస్థలు పరిగణలోకి తీసుకొని జారీ చేస్తుంటాయి. సిబిల్ స్కోర్‌తో పాటు రుణం తీసుకునే వ్యక్తి ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు, డౌన్ పేమెంట్ తదితర అంశాల ఆధారంగా లోన్స్ మంజూరు చేస్తుంటాయి.

CIBIL Score | దేశంలో ప్రముఖ క్రెడిట్ బ్యూరోల్లో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (India) ఒకటి. కార్ లోన్ ఇచ్చేందుకు సిబిల్, క్రెడిట్ స్కోర్‌ని బ్యాంకులు, ఫైన్సా్ సంస్థలు పరిగణలోకి తీసుకొని జారీ చేస్తుంటాయి. సిబిల్ స్కోర్‌తో పాటు రుణం తీసుకునే వ్యక్తి ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు, డౌన్ పేమెంట్ తదితర అంశాల ఆధారంగా లోన్స్ మంజూరు చేస్తుంటాయి. అయితే, సిబిల్ స్కోర్ ఉండాలన్న రూల్ లేనప్పటికీ.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటేనే జారీ చేస్తుంటాయి. వాస్తవానికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండడం వల్ల లోన్ సులభంగా లభించడంతో ఆపటు తక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
దాంతో భారీగానే డబ్బు ఆదా అవుతుంది. అయితే, రుణ మంజూరు సమయంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కేవలం ఎక్కువ క్రిడెట్ స్కోర్ బాగుందని మాత్రం లోన్ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. ఆదాయం, ఉపాధి అవకాశాలు, ప్రస్తుతం ఉన్న లోన్లు, చెల్లిస్తున్న విధానాన్ని సైతం ఆర్థిక సంస్థలు పరిగణలోకి తీసుకుంటాయి. క్రెడిట్ స్కోర్ 700 కంటే తక్కువగా కారు లోన్ వస్తుంది. అయితే, అధిక వడ్డీ రేటు.. కఠినమైన రుణ నిబంధనలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సకాలంలో పేమెంట్స్ చేస్తూ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉన్నది. కారు లోన్ తీసుకునేందుకు ఆదాయం, ప్రస్తుతం ఉన్న లోన్లు, డౌన్‌పేమెంట్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉంటే మంచి క్రెడిట్ హిస్టరీని చూపిస్తుంది. సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉందని రుణదాతలకు హామీ ఇస్తుంది. క్రెడిట్ రిపోర్టుల వివరాలపై అభ్యంతరాలను లేవనెత్తడం సాధ్యమేనా? అంటే అవునని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, క్రెడిట్ రిపోర్ట్‌ని తరుచూ చూడడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుందని.. అయితే, ఖచ్చితమైన వివరాల కోసం ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. అయితే, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ని లిమిట్‌తో పోలిస్తే తక్కువ బ్యాలెన్స్ నిర్వహణతో క్రెడిట్ స్కోర్‌పై సానుకూలం ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.