Gold-Silver Rates | మగువలకు షాక్‌ ఇచ్చిన బంగారం, వెండి .. తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇవే..?

Gold-Silver Rates | మగువలకు బంగారం, వెండి ధరలు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు గురువారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200కి పెరిగి.. తులానికి రూ.67,300కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.220 పెరిగి రూ.73,420కి పెరిగింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jul 11, 2024, 10:47 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | మగువలకు షాక్‌ ఇచ్చిన బంగారం, వెండి .. తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇవే..?

Gold-Silver Rates | మగువలకు బంగారం, వెండి ధరలు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు గురువారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200కి పెరిగి.. తులానికి రూ.67,300కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.220 పెరిగి రూ.73,420కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,020కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,420కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,570 వద్ద నిలకడగా ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.73,420 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక వెండి ధర స్థిరంగా ఉన్నది. కిలో బంగారం రూ.1000 పెరిగి.. ఢిల్లీలో కిలో ధర రూ.95,500 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో రూ.లక్షకి పెరిగింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.