• Telugu News
  • /Business

బంగారం, వెండి ధరలు మళ్లీ ఢమాల్

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,240 తగ్గి రూ.1,60,090వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 20250 తగ్గి రూ. 1,46,750వద్ద ఆగింది. కిలో వెండి ధర సైతం రూ.10,000తగ్గి రూ. 3,05,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | May 15, 2026, 12:00 pm IST
Read Time: 3 mins
బంగారం, వెండి ధరలు మళ్లీ ఢమాల్

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్ మారకం విలువల్లో మార్పులు, కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకాల నిర్ణయాలు వంటి అంశాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్నాయి.

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,240 తగ్గి రూ.1,60,090వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 20250 తగ్గి రూ. 1,46,750వద్ద ఆగింది. కిలో వెండి ధర సైతం రూ.10,000తగ్గి రూ. 3,05,000వద్ద కొనసాగుతుంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో బంగారం దిగుమతులను నియంత్రించి విదేశీ మారక నిల్వలను సంరక్షించడం లక్ష్యంగా కేంద్రం కొత్త కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. బంగారం,వెండిపై దిగుమతి సుంకాలను 6 శాతం నుండి 15 శాతానికి పెంచడంతో పాటు,3 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) కూడా విధించడం వల్ల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు గ్లోబల్ ఆర్థిక మందగమన భయాలు, సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.అయితే ఈ రోజు బంగారం, వెండి ధరలు తగ్గిన మునుముందు పెరగడం ఖాయం అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి :

మోదీ షాక్…పెట్రోల్..డీజిల్, సీఎన్జీ ధరల పెంపు
RRB ALP Recruitment | ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ