పెరిగిన బంగారం, వెండి ధరలు

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 1,520 పెరిగి రూ. 1,53,000కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,400 పెరిగి రూ.1,40,250 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 పెరిగి రూ.2,60,000 వద్ద కొనసాగుతుంది.

విధాత : పశ్చిమాసియా యుద్ద పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 1,520 పెరిగి రూ. 1,53,000కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,400 పెరిగి రూ.1,40,250 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 పెరిగి రూ.2,60,000 వద్ద కొనసాగుతుంది.

అమెరికా-ఇరాన్ ల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో పెను మార్పులకు కారణమైంది. ఈ సానుకూల పరిణామం నేపథ్యంలోపెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా భావించే విలువైన లోహాల వైపు మొగ్గు చూపారు. దీని ఫలితంగా బంగారం ధర సుమారు 2 శాతం పెరిగి 4,780 డాలర్ల స్థాయికి చేరుకోగా, వెండి ధర ఏకంగా 6 శాతం వృద్ధితో ఔన్సుకు 77 డాలర్ల మార్కును దాటింది.

రాయిటర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 2026 నాటికి బంగారం మధ్యస్థ ధర 4,746 డాలర్ల వద్ద ఉంటుందని అంచనా వేయగా, జేపీమోర్గాన్, వెల్స్ ఫార్గో వంటి దిగ్గజ బ్యాంకులు దీనిని 6,300 డాలర్ల వరకు పెరుగవచ్చని అంచనా వేసింది. ప్రధానంగా కేంద్ర బ్యాంకులు దాదాపు 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తాయనే అంచనా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంచనా వేశారు.

వెండికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ అమెరికా అత్యంత ఆశాజనకంగా ఉంది. బంగారం-వెండి నిష్పత్తిని బట్టి వెండి 135 డాలర్ల నుండి 309 డాలర్ల వరకు చేరవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కాల్పుల విరమణ, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల కోత అంచనాలు విలువైన లోహాలకు 2026లో గొప్ప మేలు చేసేలా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణుల అంచనా.

Latest News