Gold Rate | స్వల్పంగా తగ్గిన బంగారం..! హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గి తులం రూ.65,740కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.10 తగ్గి రూ.71,720కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,140 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,150కి తగ్గింది.

Reported by: Mallanna | వాణిజ్యం | May 04, 2024, 11:41 am IST
Read Time: 3 mins
Gold Rate | స్వల్పంగా తగ్గిన బంగారం..! హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గి తులం రూ.65,740కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.10 తగ్గి రూ.71,720కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,140 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,150కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.65,740 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,720కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.65,890 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,870కి దిగివచ్చింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.65,740 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.71,720 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర స్వల్పంగా తగ్గింది. రూ.100 తగ్గి ఢిల్లీలో కిలో వెండి రూ.83,400 చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.86,900 ధర పలుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.