Gold-Silver Rates | మహిళలకు గోల్డెన్‌ న్యూస్‌.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతో తెలుసా?

Gold-Silver Rates | మహిళలకు ఇది శుభవార్త. బంగారం, వెండి ధరలు ఊరటనిస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.66,250, 24 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.72,230 పలుకుతున్నది.

Gold-Silver Rates | మహిళలకు గోల్డెన్‌ న్యూస్‌.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతో తెలుసా?

Gold-Silver Rates | మహిళలకు ఇది శుభవార్త. బంగారం, వెండి ధరలు ఊరటనిస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.66,250, 24 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.72,230 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,800 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారం రూ.72,880కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,230కి వద్ద నిలకడగా కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,380కి వద్ద నిలకడగా ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,230 వద్ద స్థిరంగా ఉన్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి సైతం దిగి వచ్చింది. వెండి ధర కిలోకు రూ.700 తగ్గి.. ఢిల్లీలో ధర వెండి రూ.91వేలు ఉన్నది. ఇక హైదరాబాద్‌లో రూ.95,500కి తగ్గింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.