• Telugu News
  • /Business

Gold Silver Price Today | పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు

ఇరాన్ యుద్దంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరతలు బంగారం, వెండి ధరలను అనిశ్చితికి గురి చేస్తున్నాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 1,50,930వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం స్వల్పంగా రూ. 100 తగ్గి రూ. ,2,64,900వద్ద కొనసాగుతుంది

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 20, 2026, 1:08 pm IST
Read Time: 3 mins
Gold Silver Price Today | పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : ఇరాన్ యుద్దంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరతలు బంగారం, వెండి ధరలను అనిశ్చితికి గురి చేస్తున్నాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 1,50,930వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 600పెరిగి రూ. 138,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం స్వల్పంగా రూ. 100 తగ్గి రూ. ,2,64,900వద్ద కొనసాగుతుంది.

ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితుల మధ్య గ్యాస్, ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. వస్తు మార్కెట్లు అయితే ణనీయమైన అస్థిరత ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల కోసం బంగారం, వైపు మళ్లుతారు. దీంతో వాటి ధరలు పెరుగుతాయి. అయితే ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతుంది. పెట్టుబడిదారులు విలువైన లోహాల నుంచి ఇంధన రంగం వైపు పెట్టుబడులను మళ్లించడం జరుగుతోంది.

అటు ప్రపంచ వడ్డీ రేట్ల అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు కూడా విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తరుచూ పడిపోతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీర్ఘకాలికంగా మాత్రం మళ్లీ బంగారం, వెండి ధరలు పుంజుకునే అవకాశం ఉందంటున్నారు.