Gold Rates | మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ సారి ఎంత పతనమైందో తెలుసా..?

Gold Rates | వరుసగా రెండోరోజు పసిడి ధరలు పతనమయ్యాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 తగ్గి.. తులానికి రూ.71,100 తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.220 తగ్గి తులానికి రూ.77,550కి చేరింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Oct 15, 2024, 10:31 am IST
Read Time: 3 mins
Gold Rates | మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ సారి ఎంత పతనమైందో తెలుసా..?

Gold Rates | వరుసగా రెండోరోజు పసిడి ధరలు పతనమయ్యాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 తగ్గి.. తులానికి రూ.71,100 తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.220 తగ్గి తులానికి రూ.77,550కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.70,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,400కి దిగివచ్చింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.71,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,550 తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,420కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.70,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,420 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో కిలోకు ధర రూ.97వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,03,000 వద్ద కొనసాగుతున్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.