పెపైకి బంగారం ధరలు

గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 1,62,330కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300పెరిగి రూ 1,48,800 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000తగ్గి రూ. 3,15,000వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు, ఆర్థిక పరిణమాల నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనకూడదనే ప్రధాని మోదీ ప్రకటనతో బంగారం, వెండి ధరలు అమాంతం ఎగసిపడ్డాయి. దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడంతో బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలను నమోదు చేస్తూ దూసుకపోతున్నాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 1,62,330కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300పెరిగి రూ 1,48,800 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000తగ్గి రూ. 3,15,000వద్ద కొనసాగుతుంది.

మరింత పెరుగనున్న బంగారం, వెండి ధరలు

ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్ జోస్యం చెప్పింది. 2026 చివరి నాటికి బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సుకు $6,300 డాలర్లకు (ప్రస్తుతం సుమారు $4,700 – $4,800 వద్ద ఉంది) చేరుకోవచ్చని అంచనా వేశారు. ల్స్ ఫార్గో , గోల్డ్‌మన్ సాక్స్, డాయిష్ బ్యాంక్ కూడా పసిడి ధరలు $6,100 నుండి $6,300 మధ్య ఉండవచ్చని అంచనా వేయడం విశేషం.

పెరుగుదలకు కారణాలు…

బంగారం ధరలు భారీగా పెరుగుతాయని జేపీమోర్గాన్ అంచనా వేయడానికి ప్రధానంగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ఒక ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఆసియా, మధ్యప్రాచ్యం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికా డాలర్‌పై తమ ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. దీనినే ‘డీ-డాలరైజేషన్’ అని పిలుస్తారు.
భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు పెరిగినప్పుడు లేదా కరెన్సీ విలువలు పడిపోయినప్పుడు తమ సంపదను కాపాడుకోవడానికి ఈ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. జేపీమోర్గాన్ అంచనా ప్రకారం.. 2026 వరకు ఏటా 755 నుండి 800 టన్నుల బంగారాన్ని ఈ బ్యాంకులు కొనుగోలు చేస్తూనే ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెరగడానికి దోహదపడుతుంది.

మధ్యప్రాచ్య దేశాల మధ్య యుద్ధం, అమెరికా-చైనా వాణిజ్య వివాదాలు, పెరుగుతున్న అంతర్జాతీయ అప్పులు పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తున్న అస్థిర కాలంలో ‘కాగితపు ఆస్తుల’ (స్టాక్స్, బాండ్లు) కంటే ‘వాస్తవ ఆస్తుల’ (బంగారం) వైపు మళ్లడం మేలని జేపీమోర్గాన్ విశ్లేషకుడు గ్రెగొరీ షియరర్ అభిప్రాయపడ్డారు.

Latest News